Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పేలుడు పదార్థాలు స్వాధీనం : ఎస్పీ
నవతెలంగాణ-ములుగు
యువత మావోయిస్టు ప్రలోభాలకు లొంగవద్దని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జి పాటిల్ కోరారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుల ఆదేశాలతో పోలీసులను హత మార్చాలనే కుట్రతో ఏటూరునాగారం మండ లంలోని దొడ్ల గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో దాచిన పేలుడు పదార్థాలను సోమ వారం స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఏటూరునాగారం సీఐ కిరణ్‌కుమార్, ఎస్సై సిబ్బంది, కమాండెంట్ అమిత్‌కుమార్ సీఆర్పీ ఎఫ్ బలగాలతో కలిసి అటవీ ప్రాంతంలో తనిఖీ చేసి 10 జిలెటిన్ స్టిక్స్, 10 డిటోనేటర్లు, 3 క్లైమోర్మైన్లు, 5 కప్లింగ్స్, 33 ఎస్ఎల్ఆర్ లైవ్ గ్రౌండ్స్, 1 ఫైర్ ఐన రౌండ్ ఎస్ఎల్ఆర్, 1 ఫైర్ ఐన రౌండ్ ఏకే-47 తూటాలతోపాటు బ్యాటరీ, వంద మీటర్ల వైర్ బండిల్, 2 కిలోల మేకులు కలిగన బకెట్‌ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పంచుల సమక్షంలో మందుగుండు సామాగ్రిని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. యువత మావో యిస్టుల ప్రలోభాలకు లొంగకుండా అభివృద్ధి వైపు పయనించాలని కోరారు. సమావేశంలో ఓఎస్డీ శోభన్ కుమార్, ఏటూర్‌నాగారం ఏఎస్పీ అశోక్‌కుమార్, ఎస్సై రమేష్ పాల్గొన్నారు.
మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలి
జిల్లాను గంజాయి, గుట్కా ఇతర మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దాలని ఎస్పీ సంగ్రామ్ సింగ్‌జి పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. గంజాయి, గుట్కా, తదితర మత్తు పదార్థాల రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి, గుడుంబా ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీస్ స్టేషన్ల వారీగా సేకరించి కేసులు నమోదు చేయాలని సూచించారు. ఈ విషయంలో యువతకు, సర్పంచ్‌లకు అవగాహన కల్పిస్తామన్నారు. ప్రజలు అక్రమార్కులు సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఓఎస్డీ శోభన్‌కుమార్, ములుగు, ఏటూరునాగారం ఏఎస్పీలు సుధీర్ రామ్‌నాధ్ కేకన్, అశోక్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.