Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలకు మేజర్ గ్రామ పంచాయతీ అధ్వర్యంలో ఎంపీడీఓ రవీందర్‌రావుతో కలిసి సర్పంచ్ అజ్మీర బన్సీలాల్ మంగళవారం ఫర్నీచర్ అందించారు. అనంతరం సర్పంచ్ బన్సీలాల్ మాట్లాడారు. చిన్నారులకు, బాలింతలు, గర్భిణులకు అంగన్వాడీ కేంద్రాల్లో అసౌకర్యం కలగకుండా ఫర్నీచర్ అందించినట్టు తెలిపారు. అలాగే కేంద్రాల్లో దెబ్బతిన్న ఫ్యాన్లు, లైట్లు, ఇతరత్రాలకు మరమ్మతులు చేయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ రజని, సూపర్వైజర్ వహీదా, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.