Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
వాతావరణ కాలుష్య నివారణకు, జీవవైవిధ్య పరిరక్షణకు చిత్తడి నేలలు దోహదపడతాయని జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) మండల అధ్యక్షుడు గుమ్మడి లక్ష్మీనారాయణ తెలిపారు. ఈనెల 2న ప్రపంచ చిత్తడినేలల దినోత్సవాన్ని పురస్కరించుకుని చిత్తడినేలల పరిరక్షణకు సంబంధించిన కరపత్రాలను మండల కేంద్రంలో మంగళవారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ప్రతిఒక్కరూ తమ వంతు బాధ్యతగా చిత్తడి నేలలను పరిరక్షించాలని కోరారు. అనంతరం చిత్తడి నేలలో పెరిగే మొక్కలు, జంతువుల పరిరక్షణ చర్యలను వివరించారు. కార్యక్రమంలో సెక్రటరీ చాపల సంపత్, మోతీలాల్, భాస్కర్, సుమన్, వెంకటయ్య, రాంబాబు, శ్రీనివాస్, పుష్పనీల, సుహాసిని, తదితరులు పాల్గొన్నారు.