Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
మండలంలోని కాళేశ్వరం పంచాయతీ పరిధిలోని నర్సరీని ఎంపీడీఓ శంకర్ మంగళవారం సందర్శించి పరిశీలించారు. నర్సరిలో నాటిన విత్తనాలలో మొలకెత్తని విత్తనాల బ్యాగులను గుర్తించి వెంటనే లోకల్లో లభ్యమయ్యే విత్తనాలని విత్తాలని సూచించారు. తద్వారా నూరు శాతం టార్గెట్ పూర్తి చేసి ప్రతి గింజ మొలకెత్తేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీఓ కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శి గీతా కుమారి, వనసేవకులు పాల్గొన్నారు.