Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తాడ్వాయి
మేడారంలోని సమ్మక్క సారలమ్మ వనదేవతలకు మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాంనాయక్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మంగళవారం పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాలపు అనంతరెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ పులి సంపత్ గౌడ్ బలరాంనాయక్, ప్రభాకర్ వనదేవతలను దర్శించుకున్నారు. పూజారులు, ఎండోమెంట్ అధికారులు సంప్రదాయం ప్రకారం వారికి ఘనంగా స్వాగతం పలికి పూజలు చేయించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, తాడ్వాయి మండల అధ్యక్షుడు జాలపు అనంతరెడ్డి, ఎంపీటీసీ మావూరపు తిరుపతిరెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా కార్యదర్శి పీరీల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.