Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
పిల్లలకు పౌష్టికాహారం అవసరమని సీడీపీఓ హైమావతి అన్నారు. మండలంలోని మేచరాజుపల్లి, వావిలాల సెక్టార్ల సమావేశాన్ని సూపర్వైజర్లు మల్లీశ్వరి, గౌసియాతో కలిసి మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా సీడీపీఓ హైమావతి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్న పిల్లల ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఎప్పటికప్పుడు పౌష్టికాహారం అందించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని పిల్లలకు సక్రమంగా అందించాలని కోరారు. అంగన్వాడీ సెంటర్ల ఆధ్వర్యంలో కూరగాయల పెంపకం చేపట్టాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమావేశంలో అంగన్వాడీ టీచర్లు సరోజన, నీలావతి, ఉమారాణి, కవిత, మంజుల, రాజేశ్వరి, భవానీ, రాణి, శ్రీలక్ష్మి, అలివేణి తదితరులు పాల్గొన్నారు.