Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూపాలపల్లి ఏజీఎం తుమ్మలపల్లి శ్రీనివాసరావు
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
భూపాలపల్లి ఏరియా జనవరి ఉత్పత్తి, రవాణా గణాంకాలు నిరాశపర్చాని ఏజీఎం తుమ్మలపల్లి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని జీఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనవరి ఉత్పత్తి లక్ష్యం 4 లక్షల 35 వేల టన్నులు కాగా లక్షా 79 వేల 239 టన్నులతో 41 శాతం సాధించినట్టు తెలిపారు. అలాగే రవాణా లక్ష్యం 4 లక్షల 35 వేల టన్నులు కాగా లక్షా 75 వేల 412 టన్నులతో 40 శాతం సాధించినట్టు చెప్పారు. జనవరిలో ఉత్పత్తి తగ్గడానికి ఎక్స్‌ప్లోజివ్స్ తగినంత అందకపోవడం, వర్షాలు, కోవిడ్ వల్ల ఉద్యోగుల గైర్హాజరవడం కారణమని తెలిపారు. ఫిబ్రవరిలో ఉత్పత్తి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో ఏరియా పర్సనల్ మేనేజర్ అజ్మీర తుకారాం, ఏజీఎం ఐఈడీ జ్యోతి, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ మౌనిక, సీనియర్ పీఓ రాజేశం తదితరులు పాల్గొన్నారు.