Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆత్మకూర్
కాంట్రాక్టర్లు నాసిరకం రోడ్లు వేస్తూ అధికారుల సహకారంతో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. మండలంలో అక్కంపేట నుంచి నాగయ్యపల్లి వరకు ఐదు నెలల క్రితం రూ.లు 60లక్షలతో రోడ్డుపై మరమ్మతులు చేసారు. అయితే తూతూ మంత్రంగా పనులు నిర్వహించడంతో రోడ్లు దెబ్బతిని వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికార పార్టీ నాయకులే కాంట్రాక్టర్లు కావడంతో పంచాయతీరాజ్ స్పెషల్ అధికారులు వారి చెప్పు చేతుల్లో పని చేస్తున్నారని, ఈ క్రమంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకున్న చూసి చూడనట్టు వదిలేస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. పై అధికారులు స్పందించి కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోని పాడైపోయిన రోడ్లకు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.