Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ పెద్దవంగర మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య తెలిపారు. ఆ మండలంలోని పడమటి తండా పంచాయతీలో రూ.30 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ ధరావత్ రాజేందర్, పాలకుర్తి ఆలయ కమిటీ చైర్మెన్ రామచంద్రయ్య శర్మ మంగళవారం ప్రారంభించారు. అనంతరం ఐలయ్య మాట్లాడారు. నియోజకవర్గంలోని తండాల అభివృద్ధికి మంత్రి దయాకరరావు నిధులు మంజూరు చేయిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే మండలంలో రోడ్ల నిర్మాణానికి రూ.8 కోటేకల మంజూరు చేశారని తెలిపారు. నిధులను ఆయా గ్రామాల నాయకులు వినియోగించుకుని అభివద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ధరావత్ వినోద గణేష్, పార్టీ మండల అధికార ప్రతినిధి బానోత్ సోమన్న, శ్రీరామ్ సుధీర్, బొమ్మెరబోయిన రాజు యాదవ్, యూత్ మండల అధ్యక్షుడు కాసాని హరీష్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు ధరావత్ రమేష్, జూనియర్ పంచాయతీ కార్యదర్శి పావని, గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు భూక్యా అంజయ్య, వార్డు సభ్యులు భూక్యా స్వరూప, పడమటి తండా యూత్ అధ్యక్షుడు బానోత్ మైబూ తదితరులు పాల్గొన్నారు.