Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ ఘన్ పూర్
కోవిడ్ నిబంధనల దృష్ట్యా ఉపాధ్యాయులు విద్యార్థులపై అధిక శ్రద్ధ వహించాలని డీఈఓ రాము సూచించారు. మంగళవారం చిల్పూర్ మండలం శ్రీపతి పల్లి, లింగంపల్లి గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు తీరుపై ఆరా తీశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పాఠశాలకు సంబంధించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లా డారు. విద్యార్థులు కరోనా సమయంలో నష్టపోయిన సమయాన్ని ఉపయోగించుకునే విధంగా విద్యార్థులకు తెలియజెప్పాలన్నారు. పరిశుభ్రమైన వాతావరణాన్ని తప్పక పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జయసాగర్, ప్రధానోపాధ్యాయులు విజేందర్, ఉపాధ్యాయ బందం సాయి కుమారి, శ్రీనికాంత్, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.