Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
ఆదాయపన్ను రాయితీలు కల్పిస్తారని ఆశించిన ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం మరోసారి మోండిచేయి చూపిందని టీఎస్ యూటీఎప్ హనుమకొండ జిల్లా కార్యదర్శి పెండెం రాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదాయ పన్ను శ్లాబుల కానీ, స్టాండర్డ్ డిడక్షన్ కానీ, 80సీ పరిమితిని గాని మార్చకుండా యథాతధంగా ఉంచిటనట్టు పేర్కొన్నారు. ఏడేండ్ల కింద నిర్ణయించిన కనీస ఆదాయ పరిమితిని ఇంకా కొనసాగించడం సమంజసం కాదని తెలిపారు. కోట్ల రూపాయల లాభాలు గడించే కంపెనీలకు కార్పొరేట్ టాక్స్ 25శాతానికి తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, సాధారణ ఉద్యోగులకు మాత్రం 10 లక్షలు దాటితే 30శాతం టాక్స్ వసూలు చేయడం సబబు కాదని పేర్కొన్నారు. ఈ- విద్యలో భాగంగా వన్ క్లాస్- వన్ టీవీ చానళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పడం బాగుందని తెలిపారు. ఉపాధ్యాయులకు డిజిటల్ ఆధారిత విద్యలో నైపుణ్యాలు పెంపొందించుటకు బడ్జెట్లో ప్రతిపాదించిన విధంగా శిక్షణను త్వరితగతిన ఇవ్వాలని పేర్కొన్నారు.