Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇండ్ల స్థలాలు సాధించే వరకు పోరాటాలు
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ
సభ్యులు రాపర్తి సోమయ్య
నవతెలంగాణ-పాలకుర్తి
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో ఉద్యమాలు కొనసాగించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రాపర్తి సోమయ్య పిలుపునిచ్చారు. మంచుప్పుల గ్రామానికి చెందిన దళితులకు కేటాయించిన ఇండ్ల స్థలాలు వారికే ఇవ్వాలని దీక్షలు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం స్థానిక ఐలమ్మ కాంస్య విగ్రహానికి పూలమాలవేసిన అనంతరం దళితులు దీక్షలను కొనసాగించారు. ఈ సందర్భంగకాయన మాట్లాడుతూ.. దళితులకు ఇండ్ల స్థలాల ఇచ్చేంత వరకు పోరాటాలు కొనసాగించాలన్నారు. 1993లో అప్పటి ప్రభుత్వం ఇల్లు లేని 52మంది దళితులకు ఇండ్ల స్థలాల కోసం భూమిని కేటాయించి పట్టాలు ఇచ్చిందని తెలిపారు. అయితే దళితుల భూమిని కబ్జా చేయాలని చూస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు.
ఇండ్ల స్థలాల కోసం శాంతియుతంగా దీక్షలు చేస్తున్న దళితులను పోలీసులు అరెస్టు చేయడం సరికాదన్నారు. రాజ్యాంగబద్ధంగా నిరసన తెలిపే స్వేచ్ఛ అందరికీ ఉందని.. కరోనా సాకుతో దీక్షలను తీసివేయమనడం అధికారులు. ప్రజాప్రతినిధుల చేతకానితనానికి నిదర్శన మన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన అధికారులు రాజ్యాంగ విలువల్ని విస్మరిస్తే సామాన్య ప్రజలకు దిక్కెవరని ప్రశ్నించారు. ఈ ఘటనకు కారణమైన అధికారులపై ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు చిట్యాల సోమన్న, కాకర్ల రమేష్, బాణాల వెంకన్న, కాకర్ల సోమయ్య, గోగు యాదగిరి, దండంపల్లి సోమన్న, మోత్కుపల్లి యాకలక్ష్మి, గోగుల లక్ష్మి, బాణాల రేణుక, పాలడుగు యాదమ్మ, లచ్చమ్మ పాల్గొన్నారు.