Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ కొవిడ్ నియమ నిబంధనలు పాటించాలని ఎస్ఐ ఇమ్మడి వీరభద్రరావు అన్నారు. మండలంలోని మైలారం గ్రామంలో మంగళవారం ఎస్ఐ వీరభద్రరావు గ్రామస్తులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కేసులు మళ్లీ పెరుగుతున్నందున ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలన్నారు. మాస్క్ ధరించకుంటే వేయి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అరికిళ్ళ ప్రసాద్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు..