Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ (సీఐ టీయూ) నూతన సంవత్సరం క్యాలెండర్ను, డైరీని స్థానిక పంచాయతీ కార్యాల యంలో కార్యదర్శి లక్ష్మణ్, సీఐటీయూ మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్, సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండ్ల అప్పిరెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడారు. కరోనా కాలంలో పంచాయతీ కార్మికులు అనేక సేవలు అందించారని చెప్పారు. ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు దాసు, హతీరామ్, సచిన్, కలీమ్, కిషోర్, సీపీఐ(ఎం) నాయకుడు హరి, వార్డు సభ్యుడు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.