Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జెడ్పీటీసీ తేజావత్ శారద రవీందర్‌నాయక్
నవతెలంగాణ-మరిపెడ
ఎమ్మెల్యే రెడ్యానాయక్ చొరవతో మండలంలోని తండాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని జెడ్పీటీసీ తేజావత్ శారద రవీందర్‌నాయక్ తెలిపారు. మండలంలోని అజ్మీరా తండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఆనకట్ట తండాలో రూ.15 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు, డబుల్ బెడ్రూమ్ కాలనీలోని మెయిన్‌రోడ్డు, అంతర్గత రోడ్ల నిర్మాణాలకు టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రామసహాయం సత్యనారాయణరెడ్డితో కలిసి జెడ్పీటీసీ శారద గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం జెడ్పీటీసీ మాట్లాడారు. డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపుడి నవీన్‌రావు సహకారంతో రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరైనట్టు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో, తండాల్లో రోడ్లు ఉండేలా ఎమ్మెల్యే రెడ్యానాయక్ చొరవ తీసుకుంటున్నారని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ బానోతు దేవీక శ్రీనునాయక్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు తేజావత్ రవీందర్‌నాయక్, బానోత్ శ్రీనునాయక్, మాజీ సర్పంచ్ కొండూరు వెంకన్న, ఉపసర్పంచ్ రవీందర్, కిషన్, బిచ్చునాయక్, వార్డు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు