Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు
నవాతెలంగాణ-వెంకటాపురం
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఉపాధి హామీ కూలీ లకు, నిరుద్యోగులకు మొండిచేయి చూపిందని సీపీఐ జిల్లా కార్యదర్శి తోట మల్లికార్జునరావు విమర్శించారు. మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి నిధులను రూ.73 వేల కోట్ల కుదించి తీవ్ర అన్యాయం చేసిందన్నారు. పరిశ్రమలను ప్రయివేట్పరం చేస్తే 65 లక్షల ఉద్యోగాలు ఎలా భర్తీ అవుతాయని ప్రశ్నించారు. విద్యారంగానికి సైతం తగిన నిధులు కేటాయించకుండా ప్రభుత్వం మోసగించిందని మండిపడ్డారు.