Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన
నవతెలంగాణ-బయ్యారం
కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి 10 శాతం నిధులు కేటాయించాలని పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ సభ్యుడు బోనగిరి మధు డిమాండ్ చేశారు. ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గురువారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. అనంతరం మధు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 2.64 శాతం నిధులు కేటాయించడం దారుణమన్నారు. నామమాత్రంగా నిధులు కేటాయించడం వల్ల పేద, పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మారుతుందని ఆందోళన వెలిబుచ్చారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి బడ్జెట్లో సవరణ చేసి కొఠారి కమిషన్ సిఫార్సుల మేరకు విద్యారంగానికి 10 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకులు మునగాల మహేష్, సందీప్, టౌన్ నాయకులు చందు, ఈదరు తుల్లా, నవీన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.