Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మున్సిపల్ చైర్పర్సన్ గుగులోతు సింధూర కుమారి
పాఠశాలలో 'మన ఊరు-మన బడి'
నవతెలంగాణ-మరిపెడ
ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్పర్సన్ గుగులోతు సింధూర కుమారి తెలిపారు. 'మన ఊరు-మన బడి' కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ సత్యనారా యణతో కలిసి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలను గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ సింధూర కుమారి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో శుభ్రత పాటించాలని చెప్పారు. శానిటైజ్ చేయించాలని సూచించారు. విద్యార్థుల హాజరు శాతం మెరుగవ్వాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజన, ఇతర సదుపాయాలు ఉండేలా ప్రభుత్వం పలు పనులు చేపట్టనుందని తెలిపారు. పాఠశాలల్లోని అన్ని సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మెన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, కౌన్సిలర్లు పరశురాములు, హతీరామ్, హెడ్మాస్టర్ జనార్ధనచారి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.