Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతుబంధు జిల్లా కమిటీ సభ్యుడు భరత్‌కుమార్‌రెడ్డి
నవతెలంగాణ-గూడూరు
డీసీసీ బ్యాంకు సేవలను ప్రజలు వినియోగించుకోవాలని రైతుబంధు జిల్లా కమిటీ సభ్యుడు బీరవెల్లి భరత్‌కుమార్‌రెడ్డి కోరారు. నాబార్డ్ ఆర్థిక సహకారంతో స్థానిక బ్యాంకు శాఖ ఆధ్వర్యంలో గూడూరు సొసైటీలో గురువారం నిర్వహించిన ఆర్థిక అక్షరాస్యత సదస్సుకు భరత్‌కుమార్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక బ్యాంక్ బ్రాంచీలో రూ.40 కోట్ల లావాదేవీలతో ప్రజలకు సులభతరంగా రుణాలు ఇస్తున్నట్టు తెలిపారు. డిపాజిట్లపై కమర్షియల్ బ్యాంకులకు మించి 7.25 శాతం వడ్డీ ఇస్తున్నట్టు చెప్పారు. చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం వ్యాపారస్తులకు, మహిళా సంఘాలకు అతి తక్కువ వడ్డీపై రుణాలిస్తున్నట్టు తెలిపారు. బ్యాంకు ఉమ్మడి జిల్లా చైర్మెన్ మార్నేని రవీందర్రావు చొరవతో అనేక రకాల రుణాలు ఇస్తున్నారని వివరించారు. బ్యాంకు సేవలను వినియోగించుకుని రైతులు, కార్మికులు, మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలని ఆకాంక్షించారు. తొలుత ప్రజలకు బ్యాంకు సేవలపై బుర్ర కథ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో బ్యాంకు డీజీఎం కురువ నాయక్, ఏజీఎం నవీన్‌కుమార్, నోడల్ ఆఫీసర్ కష్ణమోహన్, మేనేజర్ పాషా, ఏపీఎం రవీందర్, సూపర్వైజర్ సుధాకరాచారి, పీఏసీఎస్ సీఈఓ, పాలకవర్గం, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.