Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూ.4.38 లక్షల గుట్కా ప్యాకెట్ల పట్టివేత
నవతెలంగాణ-తొర్రూరు
గుట్కాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. తొర్రూరు, నెల్లికుదురు మండలాల పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న రూ.4.38 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను గురువారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ వివరాలు వెల్లడించారు. గుట్కా ప్యాకెట్లు అక్రమంగా రవాణా అవుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు దాడి చేసి గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకుని రెండు బైక్‌లతోపాటు కారును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ చెప్పారు. దాడుల్లో సీఐ కరుణాకర్‌రావు, ఎస్ఐ సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.