Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేసీఆర్ వ్యాఖ్యల పట్ల నిరసనల వెల్లువ
నవతెలంగాణ-విలేకరులు
రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎమ్మార్పీఎస్, అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో పలు చోట్ల సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసన తెలిపారు. అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. మంగపేట మండలంలోని గంపోనిగూడెం క్రాస్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో సీతక్క పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగాన్ని మార్చడం కాదని.. రాష్ట్రంలో సీఎంను మార్చాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే కేసీఆర్‌పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ పౌరుడు నెల్లికుదురు పోలీసులకు ఫిర్యాదు అందించాడు.
మంగపేట :ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మార్చాలని కాంగ్రెస్ జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. మండలంలోని గంపోనిగూడెం క్రాస్‌లో ఆ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. బడుగులకు సమాజంలో సమాన హక్కులు కల్పించేలా ప్రపంచ మేథావి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కీర్తిస్తుండగా ప్రధాని, సీఎం మార్చాలనడం హేయమన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవళిరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు
కాంగ్రెస్, బీజేపీ, నేతకాని సంఘం ఆధ్వర్యంలో..
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా మండలంలో కాంగ్రెస్, బీజేపీ, నేత కాని కుల సంఘం ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన తెలిపారు. మండలంలోని రాజుపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు ఎరంగారి విరన్ కుమార్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి వేణు ఆధ్వర్యంలో భీమ్ దీక్ష చేపట్టారు. అలాగే తిమ్మంపేటలో నేతకాని కుల సంఘం నాయకులు దుర్గం భిక్షపతి, గాందెర్ల సంతోష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలభిషేకం చేశారు. కార్యక్రమాల్లో ఆ పార్టీల, కులసంఘ నాయకులు దీగొండ కాంతారావు, దుర్గం నర్సింహారావు, బసారికారి నాగార్జున్, జాడి రమేష్, సల్లూరి రాజేందర్, సల్లూరి సత్యనారాయణ, దుర్గం శశినాధ్, దుర్గం వెంకటేశ్వర్లు, జాడి గణేష్, పూసల గణేష్, భూక్య రతన్ సింగ్ నాయక్, రావుల జానకిరామ్, వల్లిపల్లి బాల మురళి, శానపురి శేఖర్, మైప నవీన్, ఇప్ప నర్సయ్య, మండల సంతోష్, తోలేటి నవీన్, ఉల్లేటి గంగాప్రసాద్, చిట్యాల బాలు, నాగేంద్రబాబు, బట్ట దామోదర్, నగేష్, చంటి, పత్రి చిన్న రాజు, ప్రశాంత్, సాగర్, అక్కినేని రాజశేఖర్ పాల్గొన్నారు.
బయ్యారం : రాజ్యాంగం పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ ఉపసంహరించుకోవాలని కేవీపీఎస్ మండల అధ్యక్షుడు బల్లెం ఆనందరావు డిమాండ్ చేశారు. మండలంలోని కొత్తపేటలో మంద దేవదానం అధ్యక్షతన సమావేశం నిర్వహించగా ఆనందరావు మాట్లాడారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు సైతం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన క్రమంలో సుమోటోగా తీసుకుని కోర్టు ధిక్కారం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు భిక్షం, రవి, రాంబాబు, వీరస్వామి, రాములు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మార్పీఎస్, అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో..
మండల కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ఎమ్మార్పీఎస్, అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నెమలి భిక్షపతి, సోమవరపు రవి, బరిగెల ఉపేందర్, కొమిరె సంపత్, కందిపాటి నాగరాజు, మహేష్, కృష్ణ, మట్టె ఎల్లయ్య, వీరన్న తదితరులు పాల్గొన్నారు.
మరిపెడ : బీఎస్పీ డోర్నకల్ నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఐనాల పరశురాములు మాట్లాడారు. సీఎం కేసీఆర్ పదవికి రాజీనామా చేసి పౌర సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు ఐతం ఉపేందర్, కోశాధికారి భాషిపంగు మహేందర్, నాయకులు భాషిపంగు ప్రకాష్, అశోక్ రావణ్, పొలెపాక ప్రవీణ్‌కుమార్, బ్రహ్మం, తేలూరి వెంకటప్పయ్య, రంజిత్, మధు, మోహన్, సుంచు పిచ్చయ్య, ప్రవీణ్, వెంకటేష్, వంశీధర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్‌లో పౌరుడి ఫిర్యాదు
నెల్లికుదురు : సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండలంలోని బంజర గ్రామానికి చెందిన పౌరుడు పెరుగు అనిల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదని, దళితులను అవమానించేలా వ్యాఖ్యలు చేశాడని తెలిపారు. సీఎం కేసీఆర్‌పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని అనిల్ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్, టీడీపీ ఆధ్వర్యంలో నిరసన
కాంగ్రెస్, ఎమ్మార్పీఎస్, టీడీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరు అశోక్ గౌడ్, టీడీపీ అనుబంధ దళిత సంఘం రాష్ట్ర నాయకుడు కడారి ఐలయ్య, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తుల వెంకన్న మాట్లాడారు. కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు బిర్రు యాకయ్య, మండల అధ్యక్షుడు తూళ్ల వెంకన్న, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ప్రణరుకుమార్, పీఏసీఎస్ డైరెక్టర్ జెల్ల సోమయ్య, గుగులోతు బాలాజీ నాయక్, పులి శ్రీను, భాస్కర్‌నాయక్, పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు : మండలంలోని హరిపిరాలలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబే ద్కర్ యువజన సంఘ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో నాయకులు గద్దల పరుశురామ్, కన్నా, సంజీవ, వెంకటేష్, ప్రవీణ్, భరత్, రాహుల్, ప్రవీణ్, వేణు, వెంకటేష్, సందీప్, అశోక్ పాల్గొన్నారు.
గూడూరు : మండల కేంద్రంలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ శైలజకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా ఇన్‌ఛార్జి దార్ల శివరాజ్, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు ప్రసాదరావు, జిల్లా కోశాధికారి జింక లక్ష్మణ్, నాయకులు తప్పెట్ల చాణక్య, గుమ్మడి కృష్ణ, యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.
గార్ల : స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించగా మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రావూక విమల్ కుమార్ జైన్ మాట్లాడారు. కార్యక్రమంలో ఉమేష్, రాజశేఖర్, ఎజాజ్, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ అధ్వర్యంలో..
స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెస్ డెంట్ తాళ్లపల్లి కష్ణ గౌడ్ మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు జవహర్ లాల్, కృష్ణయ్య, నాని, రామారావు, రాహుల్, వినరు, రామకష్ణ, తదితరులు పాల్గొన్నారు.
ఏటూరునాగారం టౌన్ : మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు గండెపల్లి సత్యం, యూత్ మండల అధ్యక్షుడు వినుకొల్లు చక్రవర్తి మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకుడు రామరాజు, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈక మహాలక్ష్మి, మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు పలక గంగ, నాయకులు కందాడి ఎలేందర్, కొప్పుల నవీన్, ఎలుకపల్లి శ్రీనివాస్, ఆత్కూరి ప్రేమలత, గండెపల్లి రజిని, తదితరులు పాల్గొన్నారు.