Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
వనదేవతలకు పూజలు
నవతెలంగాణ-తాడ్వాయి
మేడారం మహాజాతర నేపథ్యంలో ప్రజల కోసం మరింత మెరుగైన రవాణా సేవలు అందించనున్నట్టు ఆర్టీసీ ఎండీ విశ్వనాథ చెన్నప్ప (వీసీ) సజ్జనార్ తెలిపారు. మేడారంలోని వనదేవతలను గురువారం ఆయన దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిలువెత్తు బంగారాన్ని (బెల్లాన్ని) వనదేవతలకు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు, పూజారులు, ఎండోమెంట్ అధికారులు ఆయనకు సంప్రదాయాలతో స్వాగతం పలికారు. పట్టు వస్త్రాలతో సత్కరించి జ్ఞాపిక అందించారు. అనంతరం సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. ఈసారి మేడారానికి గతానికి మించి భారీ సంఖ్యలో జనం రానున్నట్టు అంచనా వేస్తున్నామని చెప్పారు. జాతరకు రెండు నెలల ముందు నుంచే తెలంగాణ, ఏపీ, ఉత్తర్ప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ఘడ్, తదితర రాష్ట్రాల నుంచి భారీగా జనం తరలి వస్తున్నారని చెప్పారు. జనం రాకకు అనుగుణంగా ఆర్టీసీ సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసి బస్టాండ్ ఆవరణలో జనం కోసం తాగునీటి, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. మేడారినికి ఈసారి నాలుగు వేలకుపైగా బస్సు సర్వీసులు నడిపిస్తున్నట్టు తెలిపారు. దేవాదాయ, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకుని ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయం కల్పిస్తున్నట్టు చెప్పారు.