Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్
చైర్పర్సన్ ఉష దయాకర్‌రావు
నవతెలంగాణ-తొర్రూర్
యువత స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఉష దయాకర్‌రావు ఆకాంక్షించారు. డివిజన్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఏ టు జెడ్ సర్వీసెస్ కార్యాలయాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. అనంతరం ఆ కార్యాలయ నిర్వాహకులు అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, ఎర్ర సంపత్‌కుమార్, నలమాస ప్రమోద్, హపావత్ సురేష్‌లతో కలిసి ఉష దయాకర్‌రావు మాట్లాడారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి చూడకుండా అందుబాటులో ఉన్న స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. స్థానికంగా వ్యాపార కేంద్రాలను ప్రారంభించి ప్రజాసేవ చేస్తూ ఉపాధి పొందాలని చెప్పారు. తద్వారా ఆర్థికంగా అభివద్ధి చెందడంతోపాటు మరో 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అలాగే నాణ్యమైన సేవలతో వినియోగదారుల మన్ననలు పొందాలని చెప్పారు. శరవేగంగా అభివద్ధి చెందుతున్న తొర్రూరులో అన్ని వ్యాపారాలకు అనువుగా ఉంటుందన్నారు. స్వయం ఉపాధి మార్గాలు ఎంచుకోవడం ద్వారా కుటుంబానికి ఆసరాగా నిల్వవచ్చని చెప్పారు. గ్రామ పంచాయతీ మున్సిపాల్టీగా తొర్రూరు అభివృద్ధి చెందిన అనంతరం దినదినాభివద్ధి చెందుతోందని తెలిపారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవతో పట్టణంలో అనేక మౌలిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరమణ, మున్సిపల్ చైర్మెన్ మంగళపల్లి రామచంద్రయ్య, ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, సీఐ కరుణాకర్‌రావు, పీఏసీఎస్ చైర్మెన్ కాకిరాల హరిప్రసాద్, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, రామిని శ్రీనివాస్, కౌన్సిలర్లు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.