Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజాసంఘాల జేఏసీ చైర్మెన్ భిక్షపతి గౌడ్
వైఎస్సార్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిలకు వినతి
నవతెలంగాణ-తాడ్వాయి
ములుగు జిల్లాకు సమ్మక్క-సారక్క పేరు పెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష పాటిస్తోందని జిల్లా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రజాసంఘాల జేఏసీ చైర్మెన్ ముంజాల భిక్షపతి గౌడ్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లాకు సమ్మక్క-సారక్క పేరు పెట్టేలా కషి చేయాలని కోరుతూ భిక్షపతి ఆధ్వర్యంలోని బృందం మండలంలోని మేడారానికి వచ్చిన వైఎస్సాఆర్టీపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు షర్మిలకు గురువారం వినతిపత్రం అందించింది. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడారు. స్వరాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చి తదనంతరం విస్మరించారని చెప్పారు. ఇతర జిల్లాలకు ఇచ్చిన మాట ప్రకారం పేర్లు మార్చినా ములుగు పట్ల మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో నాయకులు సామర్ల గణేష్, తదితరులు పాల్గొన్నారు.