Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో మంగపేట, తిమ్మంపేట, కమలాపురం, నర్సింహసాగర్, దోమెడ గ్రామాలకు చెందిన లబ్దిదారులకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క గురు వారం కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి తహసీల్దార్ సలీమ్ అధ్యక్షత వహించి మాట్లాడారు. మండలంలో ముగ్గురికి కళ్యాణలక్ష్మీ, ఆరుగురికి షాదీముబారక్ చెక్కులు అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మెన్ తోట రమేష్, జెడ్పీ కోఆప్షన్ సభ్యురాలు వలీయాబీ, డిప్యూటీ తహసీల్దార్ సురేష్ బాబు, ఆర్ఐలు కుమారస్వామి, సునీల్, ఏసుపాదం, నందకిషోర్, సిబ్బంది పాల్గొన్నారు.