Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
హెల్త్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా మండలంలోని చెరుపల్లిలో గురువారం మాక్ డ్రిల్ 'డ్రై రన్' కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పీహెచ్సీ వైద్యాధికారి నగేష్ నాయక్ మాట్లాడారు. హెల్త్ ప్రొఫైల్‌లో భాగంగా ఇంటింటికీ సర్వే నిర్వహించి 18 ఏండ్లు నిండిన ప్రజల రక్త నమూనాలు సేకరించి 34 రకాల పరీక్షలు చేయనున్ననట్లు తెలిపారు. రక్త నమూనాలను జిల్లా కేంద్రంలోని టీ-హబ్‌కు పంపి రిపోర్టులు తయారు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 18 ఏండ్లకుపైబడ్డ వ్యక్తులకు అన్ని రకాల పరీక్షలను ఉచితంగా చేయనున్నట్లు వివరించారు. ఈనెల 3 నుంచి 40 రోజుల పాటు మండలంలో డ్రై రన్ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీపీఓ అర్చన, హెచ్వీ గంగమ్మ, పీహెచ్ఎన్ శకుంతల, ఏఏన్ఎంలు మమత, జమున, రాణి పాల్గొన్నారు.