Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బేతి దేవేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్
రహదారి నిర్మాణం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ నాణ్యత ప్రమాణాలను తుంగలో తొక్కిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి. ఫోన్ చేసిన ఫలితం లేదు. ప్యాచ్ వర్కుల సమయంలో ఊడిపోతున్నాయి. బీటీ నిర్మాణం కూడా అంతంత మాత్రంగానే ఉంది. అధికా రుల పర్యవేక్షణ లోపం ఉంది. ఇప్పటివరకు అధికారులు స్పందించిన దాఖలాల్లేవు. రహదారి వెంట తీసిన పాత బీటీ కుప్పల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పోసిన డీటీ రహదారి వెంట మొరం పూర్తి స్థాయిలో పోయడం లేదు. ఇది వచ్చిపోయే వాహనాల ధాటికి వెంటనే పక్కకు పోతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ప్రజాప్రతినిధులు, అధికారులు రహదారి ఒకచోట వేస్తే మరోచోట ప్రారంభించి వెళ్లారు. అధికారులు శిలాఫలకానికి టీఆర్ఎస్ రంగు వేసి రాజకీయ భక్తి చాటడం హాస్యాస్పదంగా ఉంది. రహదారిని పరిశీలిస్తే డొల్లతనం బయట పడుతుంది.