Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పలు మూగజీవాలు మృత్యువాత
అ తొలగించాలని ప్రజల ఆందోళన
నవతెలంగాణ-మల్హర్రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని 12వ వార్డు (గౌండ్లపల్లి)లోని ట్రాన్స్ఫార్మర్ చుట్టూ నేలపై ఆరు నెలలుగా విద్యుత్‌సరఫరా అవుతోంది. పలుమార్లు మూగజీవాలు విద్యుద్ఘాతానికి గురై మృత్యువాతపడిన ఘటనలూ ఉన్నాయని వెంటనే ట్రాన్స్ఫార్మర్ తొలగిం చాలని స్థానికులు రేపాల శంకయ్య, అంగజాల శ్రీనివాస్, బాణయ్య, రాజశేఖర్, అంగజాల మల్లయ్య, రాజయ్య, స్వామి, తిరుపతి, మంచాల రాజైలు, మాచర్ల సమ్మయ్య, చిన్న ఐలయ్య తదితరులు కోరారు. గురువారం వార్డలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ.. వార్డులోని ట్రాన్స్ఫార్మర్ చుట్టూ విద్యుత్ సరఫరా అయి ఇప్పటికే మూడు గేదెలు, నాలుగు గొర్రెలు మత్యువాత పడ్డాయని, మల్లమ్మ అనే వృద్ధురాలు విద్యుద్ఘాతానికి గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయం విద్యుత్‌శాఖ అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు పట్టించు కుని జన సంచారం లేని ప్రదేశంలోకి ట్రాన్స్ఫార్మర్ మార్చాలని విజ్ఞప్తి చేశారు.