Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంపొంది ంచుకోవాలని ఆచార్య హనుమంతు తెలిపారు. శుక్రవారం ఆర్ట్స్ కళాశాలలోని ఎన్ఎస్ఎస్ విభా గం, ఐక్యూ సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ క్యాన్సర్ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధి కారకాలను గుర్తించి, వాటిని అడ్డుకోవ డానికి కృషి చేయాలన్నారు. ఎన్ఎస్ఎస్ విభా గం అధికారులు డాక్టర్ నాగయ్య, డాక్టర్ కనకయ్య, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్. చందులాల్, అధ్యాపకులు, విద్యార్థులుపాల్గొన్నారు.
సుబేదారి యూనివర్సిటీ మహిళా కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డా||కవిత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు భాగ్యలక్ష్మి, లక్ష్మీనారాయణ, రవీందర్, నర్సింహులు, సంధ్య, ప్రీతి, విద్యార్థులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-కాజీపేట
ఫాతిమానగర్ క్యాన్సర్ ఆస్పత్రిలో శుక్రవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్స నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి మహేష్ నాథ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. క్యాన్సర్ వ్యాధిగ్రస్థులు భయపడాల్సిన అవసరం లేదన్నారు. క్యాన్సర్ మహమ్మారి నుండి కోలుకున్న వారిని ఉదాహరణగా తీసుకొని ధైర్యంగా ఉండాలని చెప్పారు. అనంతరం క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా పండ్లు, బ్రెడ్లను పంపిణీ చేశారు.