Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఐనవోలు
గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల పెంపు కోసం నిర్వహించే ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పంచాయతీ ఎంప్లాయీస్, వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆ యూనియన్ మండల అధ్యక్షులు కస్తూరి ఏసోబు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
నిత్యం గ్రామల స్వచ్ఛత కోసం కృషి చేస్తున్న పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచకపోవడం దారుణమన్నారు. కొత్త పిఆర్సి ప్రకారం రాష్ట్రంలో అన్ని తరగతుల ఉద్యోగులకు ప్రజాప్రతినిధులకు వేతనాలు పెంచారన్నారు. కానీ సిబ్బందికి వేతనాలు పెంపు పట్ల ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని వాపోయారు. తక్షణమే గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బందికి అందరికీ వేతనాలు పెంచాలని, జీవో నెంబర్ 51ని సవరించాలని, ఉద్యోగులకు ఇన్సూరెన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 21, 22న నిర్వహించే ఎమ్మెల్యేల ఇండ్ల్లు ముట్టడి చేసి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎం శ్రీనివాస్, రవి, చంద్రయ్య, రవి, రాయుడు, లచ్చమ్మ, ఎల్లమ్మ గట్టయ్య, అనిల్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.