Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఎల్పీఓ కల్పన
నవతెలంగాణ-శాయంపేట
గ్రామాలలో పారిశుద్ధ్య పనులను మల్టీపర్పస్ వర్కర్లతో సక్రమంగా చేయించాలని డీఎల్పీవో కల్పన ఆదేశించారు. మండల కేంద్రంలోని దళిత కాలనీలో శానిటేషన్ పనులను శుక్రవారం ఆమె పరిశీలించారు. అనంతరం గ్రామ పంచాయతీలోని రికార్డులను తనిఖీ చేశారు. గ్రామంలో వసూలు చేసిన నల్ల, ఇంటి పన్నుల డబ్బులు ఎస్టివో లో జమ చేయకుండా మల్టీ పర్పస్ వర్కర్ రమేష్ 32,000 ఖర్చు చేసినట్లు విచారణలో వెల్లడి కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపై విచారణ చేపట్టగా గ్రామపంచాయతీ పనులకే ఖర్చు చేశామని వెల్లడించినట్లు తెలిపారు. నల్ల, ఇంటి పన్నులు ఎస్ టి వో లో జమ చేశాకే వినియోగించాలని ఆదేశించారు. రమేష్ వద్ద నుండి 32 వేలు రికవరీ చేయాలని పంచాయతీ కార్యదర్శి రమణారెడ్డిని ఆదేశించారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మల్టీపర్పస్ సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేయించా లన్నారు. ప్రతిరోజు పల్లె ప్రగతి పనులు కూడా చేయించాలని సూచించారు. త్రాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. ఆమె వెంట ఎంపీఓ రంజిత్ కుమార్, సర్పంచ్ కందగట్ల రవి పాల్గొన్నారు.