Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - వర్ధన్నపేట
విధుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని, ఫిబ్రవరి 15లోపు నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గొట్టె శ్రీనివాస్, ఎంపీపీ అన్నమనేని అప్పారావు వివోఏలను హెచ్చరి ంచారు. శుక్రవారం స్థానికి ఎంపీపీ కార్యాల యంలో విఓఏల పని తీరుపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా, సామాజి కంగా అభివద్ధి పరచాలని లక్ష్యంతో వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారశుద్ధి ఉత్పత్తుల తయారీ కేంద్రాల ఏర్పాటు కోసం అవగాహన కల్పించాల్సిన బాధ్యత వీఓఏలపై ఉందన్నారు. మండలాన్ని జిల్లాలో మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీపీఎంలు మున గాల దయాకర్, సరిత, భవాని, ఏపీఎంలు వేణు, కృష్ణమూర్తి, సీసీలు గోలి కొమురయ్య, రమేష్, స్వామి, సంపత్, పర్వతగిరి రాయపర్తి వర్ధన్నపేట మండలాల సీసీలు, విఓఏలు తదితరులు పాల్గొన్నారు.