Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
దేశ భవిష్యత్ యువతపెనే ఆధారపడి ఉందని తహశీల్దార్ రజిని అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణంలో సీఐ బొల్లం రమేష్ కుమార్ సారథ్యంలో మాదకద్రవ్యాల నివారణపై యువతకు, గ్రామ ప్రజా ప్రతినిధులుకు, ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల ద్వారా యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను నిత్యం పర్యవేక్షించాలన్నారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. మండలాన్ని మాదకద్రవ్యాల రహిత మండలంగా తీర్చిదిద్దడానికి ప్రతిఒక్క పౌరుడు సహకారం అందించాలన్నారు. మత్తుపదార్థాల సాగు, రవాణా, విక్రయం జరిపే వారి వివరాలు తెలిస్తే సమాచారం అందించాలని పేర్కొన్నారు. అలా దొరికిన వారికీ సంక్షేమ పథకాలు తొలగిస్తామని తెలిపారు. గంజాయి సేవిస్తూ కనపడినప్పుడు 100 కు డయల్ చేయాలని కోరారు. వారి పైన ఎలాంటి కేసులు నమోదు చేయకుండా సరైన ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జోహార్ రెడ్డి, ఎస్ఐ సాయిబాబు, ఎక్సైజ్ ఎస్సై ప్రవీణ్, టీిఆర్ఎస్ మండలాధ్యక్షుడు, సర్పంచ్ మునిగేల రాజు, మునగాల యాకోబు, కలకోట అనిల్, లకావత్ మొగిలి, గోనెల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.