Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
యువత మత్తుకు బానిస కావద్దని సీఐ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై పరమేష్ ఆధ్వర్యంలో సర్పంచ్లు, ఎంపీటీసీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, ఆన్లైన్ గేమింగ్లు అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. సర్కిల్ పరిధిలోని ముల్కనూరు, వంగర, ఎల్కతుర్తిలో ఆన్లైన్ గేమ్, గంజాయి, గుడుంబా, గుట్కాలు లేకుండా కషి చేసి సమాజానికి మంచి పేరు తెచ్చే విధంగా సర్పంచ్లు, ఎంపీటీలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల స్వప్న ,సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు బూర్గుల రామారావు ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కడారి రాజు, సర్పంచులు మాసిపెద్ది భాస్కర్ రావు, కుడి తాడి అనిత రాజు, కడారి రమ ప్రసాద్, బోయినిపల్లి రజిత దేవేందర్ రావు, ఆరేపల్లి భాగ్యలక్ష్మి, ఎంపీటీసీలు బొంకురి రజిత రవీందర్, వేములరజినీ వెంకన్న, భవాని దేవేందర్ రావు, ఆదాం తదితరులు హాజరయ్యారు.