Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి
నవతెలంగాణ-ఆత్మకూరు
అగ్రంపహాడ్ సమ్మక్క-సారక్క జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి అన్నారు. శుక్రవారం ఆమె ఆర్డీఓ వాసుచంద్ర, డీపీఓ జగదీశ్వర్, తహశీల్దార్ సురేష్కుమార్లతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించి మాట్లా డారు. జాతర సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అన్ని శాఖల అధికారు లకు సూచనలు అందించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కరోనా నియమాలను పాటిస్తూ ప్రతిఒక్కరూ మాస్కు ధరించేలా చూడాలన్నారు. రోడ్లపై వాహనాలు నిలువకుండా అధికారులు చూసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జాతర విజయవంతం కావడానికి దోహదపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ గణేష్ కుమార్, ఎంపీపీ మార్క సుమలత, జెడ్పీటీసీ కక్కెర్ల రాధిక, ఈఓ గుల్లపెల్లి శేషగిరి, జాతర చైర్మన్ గుండెబోయిన రాజన్న గౌడ్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, హెల్త్ ఆఫీసర్ డా.అశ్విన్ కుమార్, ఆర్టీసీ డీఎం మోహన్ రావు, సర్పంచ్ మాదాసి అన్నపూర్ణ-రాజు తదితరులు పాల్గొన్నారు.
పల్లెప్రకృతి వనం పరిశీలన
అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి శుక్రవారం అగ్రంపహాడ్లోని పల్లెప్రకృతి వనం నర్సరీని పరిశీలించి మాట్లాడారు. పల్లె ప్రకృతి వనం నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ సర్పంచ్ మాదాసి అన్నపూర్ణ రాజును అభినందించారు.