Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ శాయంపేట
భవిష్యత్ తరాల కోసం ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎంపీడీవో ఆమంచ కష్ణమూర్తి అన్నారు. కాట్రపల్లి గ్రామంలో నెహ్రూ యువ కేంద్ర వరంగల్ ఆధ్వర్యంలో శుక్రవారం జల జాగరణ అభియాన్ కార్యక్రమం యువ తేజ యూత్ నాయకులు సునీల్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎంపీడీఓ హాజరై మాట్లాడారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడంతో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. మిషన్ భగీరథ నీటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఒంటేరు వనమ్మ వీరస్వామి, ఎంపిటిసి అజ్మేరా ఉమా రఘు సింగ్, యూత్ సభ్యులు పాల్గొన్నారు.