Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డీఈఓ జీ పాణిని
పసర జెడ్పీ పాఠశాల తనిఖీ
నవతెలంగాణ-గోవిందరావుపేట.
విద్యార్థుల్లో సృజనాత్మకను పెంపొదించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని డీఈఓ జీ పాణిని తెలిపారు. శుక్రవారం పసర జెడ్పీ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులు అసంపూర్తిగా ఉండటంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో విద్యా శాఖకు జరిగిన నష్టాన్ని ఉపాధ్యాయులు పూర్తి చేయాలన్నారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడం, విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులను వారి శక్తి సామర్థ్యాలను బట్టి గ్రేడ్లుగా విభజించాలని, వారిలో సజనాత్మకతను పెంపొందించే విధంగా కృషి చేయాలన్నారు. విద్యార్థులు అందరు పాఠశాలకు వచ్చే విధంగా ఉపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు చదవడం, రాయడం రావాలి
నవతెలంగాణ సుబేదారి
విద్యార్థులకు తప్పనిసరిగా చదవడం, రాయడం రావాలని డీఈఓ రంగయ్య నాయుడు తెలిపారు. జిల్లాలో నేటి నుంచి 'చదువు ఆనందించు మరియు అభివద్ధి చెందు' అనే కార్యక్రమాన్ని ప్రభుత్వ, కేజీబీవీ, మోడల్ పాఠశాలలో బాలవాటిక నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థులకు అమలు చేయాలని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ఎంఈఓలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో నగరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చదవగలిగే వారే దేనినైనా నేర్చుకో గలుగుతారన్నారు. తార్కికంగా ఆలోచించడం, భావ వ్యక్తీకరణ చేయడం, తప్పులు లేకుండా రాయడం, చదవడం వల్లనే సాధ్యమవుతోందన్నారు. అంతేగాకుండా విద్యార్థుల్లో ఆత్మన్యూనత పోయి అభ్యసన సామర్థ్యాలు పెరుగుతాయన్నారు. ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే సరికి విద్యార్థులందరూ ధారాళంగా చదవాలన్నారు. పిల్లలు రీడ్ కార్యక్రమంలో పాల్గొనేలా, ధారాళంగా చదివేలా, గ్రంథాలయ పుస్తకాలు చదివించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠశాల స్థాయిలో ప్రధానోపాధ్యాయులు, కాంప్లెక్స్ స్థాయిలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల స్థాయిలో ఎంఈఓలు, జిల్లా స్థాయిలో సెక్టోరల్ అధికారులు కార్యక్రమ అమలుఉ పర్యవేక్షిస్తారన్నారు.