Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ
నవతెలంగాణ-వర్ధన్నపేట
అసంఘటిత రంగ కార్మికులకు ఈ శ్రమ్ పోర్టల్ ద్వారా లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను విధిగా నమోదు చేసుకోవాలని వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోతు అరుణ తెలిపారు. శుక్రవారం స్థానిక ఎంఎంఆర్ గార్డెన్స్‌లో అరూరి గట్టుమల్లు మెమోమరియల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అరూరి విశాల్ ఆధ్వర్యంలో ఈశ్రమ్ నమోదు కార్యక్రమాన్ని వైస్‌చైర్మన్ ఎలేందర్రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ లేబర్ ఇన్సూరెన్స్ కార్డు ద్వారా అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పదో డివిజన్ కౌన్సిలర్ తుమ్మల రవీందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండేటి శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షులు కొండేటి సంపత్, పట్టణ ఉపాధ్యక్షులు కొండేటి సాంబయ్య, జన్ను నవీన్, కొండేటి మాధవ్ తదితరులు పాల్గొన్నారు.