Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్
నవతెలంగాణ-మట్టెవాడ
జర్నలిస్టుల సాధకబాధకాలు తనకు తెలుసునని, వారి సంక్షేమం కోసం కృషి చేస్తూ, అన్ని విధాల ఆదుకుంటానని ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. 27వ డివిజన్లోని తూర్పు జర్నలిస్ట్ పరపతి సంఘం భవనంలో సంఘము అధ్యక్షుడు కోరుకొప్పుల నరేందర్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై డైరీని ఆవిష్కరించి మాట్లాడారు. ప్రభుత్వం ద్వారా జర్నలిస్టులకు అన్ని హంగులతో డబుల్ బెడ్ రూము ఇండ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. జర్నలిస్టులకు వతిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగా ఎవరికి ఎలాంటి సేవలు కావాలన్న అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. వరంగల్ జిల్లాను రాష్ట్రంలో అభివద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు అందరం కలిసి అభివద్ధి బాటలో సాగుదామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు గాడిపెళ్లి మధు, సంగోజు రవి, మిదేల రంగనాథ్, ప్రధాన కార్యదర్శి బండి రవి, కోశాధికారి వడిచెర్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జన్ను స్వామి, పెరుమాండ్ల మధుసూధన్, రాపెల్లి ఉపేందర్, ఉప కోశాధికారి మట్టా దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.