Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పెరిగిన పని భారం...
అ ఒత్తిడితో సతమతమవుతున్న వైనం
అ పల్లెప్రగతి పనుల పర్యవేక్షణతోపాటు
అదనంగా ఉపాధి పనులు
నవతెలంగాణ-మల్హర్రావు
గ్రామస్థాయిలో పల్లెప్రగతి పనులను నిత్యం పర్యవేక్షించే పంచాయతీ కార్యదర్శులు అదనపు పని భారంతో సతమతమవుతున్నారు. జీపీ పాలకవర్గం తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథ కాలు, అభివృద్ధి కార్యక్రమాల్ని గ్రామస్థాయిలో అమ లుపర్చడంతోపాటు పర్యవేక్షిస్తుంటారు. ఇటీవల కార్యదర్శులకు వివిధ విభాగాల పర్యవేక్షణ పనులను ప్రభుత్వం అదనంగా కేటాయించింది. దీంతో తమకు తలకు మించిన భారమవుతోందని పంచా యతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండవ్యాప్తంగా 15 గ్రామపంచాయతీలు ఉండగా 13మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. రుద్రారం, తాడిచెర్ల, మల్లారం కార్యదర్శులు ఇటీవల బదిలీ కాగా మల్లారం గ్రామానికి కార్యదర్శిని నియ మించారు. తాడిచెర్లకు వల్లెంకుంట కార్యదర్శికి, రుద్రారం, ఎడ్లపల్లి కార్యదర్శికి ఇన్చార్జీ బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా 13 మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. ఇందులో ముగ్గురు మహిళ కార్యదర్శులు ఉండగా 10మంది పురుషులు ఉన్నారు. ఇందులో 13 మంది జూనియర్ పంచా యతీ కార్యదర్శులు ఉన్నారు. కార్యదర్శులందరూ పనిచేసే ప్రదేశానికి నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఉండాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి తోడు ప్రత్యేక యాప్ ఏర్పాటు చేసింది. దీంతో పంచా యతీ కార్యాలయం ఎదుట ఉదయం 7గంటల నుంచి 8 గంటలలోపు కార్యదర్శి హాజరై యాప్ లో హాజరు నమోదు చేయాలి. సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో ఉండాల్సి వస్తోంది. ముఖ్యంగా మహిళ పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి పనులు పూర్తి చేసుకొని ఉదయమే కార్యాలయానికి రావడం కష్టమవుతుందోని వాపోతున్నారు.
గ్రామస్థాయిలో కార్యదర్శులతోపాటు వీఆర్ఓ లు, ఫీల్డ్ అసిస్టెంట్లు వివిధ భాగాల్లో పని చేస్తుం టారు. జాతీయ ఉపాధిహామీ పనుల పర్యవేక్షణను గతంలో ఫీల్డ్ అసిస్టెంట్లు చూసేవారు. వీఆర్వోలు గ్రామస్థాయిలో వివిధ రకాల ధ్రువపత్రాల జారీ రెవెన్యూ పనులు నిర్వహిస్తుంటారు. కానీ, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించింది. అలాగే వీఆర్ఓలను బాధ్యతల నుంచి తప్పించింది. దీంతో కార్యదర్శులకు సాధారణ విధులతోపాటు జాతీయ ఉపాధిహామీ పనుల పర్యవేక్షణ కూడా ప్రభు త్వం అప్పగించింది. ఇంటి పన్నుల వసూళ్లు, కూలీల పనుల పరిశీలన తదితర అదనపు పనులు అప్పగించడంతో తలలు పట్టుకుంటున్న పరిస్థితి. జూనియర్ మహిళా పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం ఇచ్చే ప్రసూతి సెలవులు ఆరు నెలలు వర్తించడం లేదు. ప్రభుత్వం నాలుగేళ్ళ ప్రాబేషన్ పీరియడ్ పెట్టడంతో వీరికి నాలుగు నెలల ప్రసూతి సెలవులను వర్తింపజేస్తున్నారు. దీంతో చిన్నపిల్లలతో మహిళ కార్యదర్శులు విధులకు హాజరు కావాల్సి వస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వం పనిభారం తగ్గించేలా చూడాలని కార్యదర్శులు కోరుతున్నారు.