Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎర్రటెండలో విద్యార్థులకు పనిష్మెంట్
అ చర్యలు తీసుకోవాలంటున్న తల్లిదండ్రులు
నవతెలంగాణ-జనగామ
ఎర్రటెండలో విద్యార్థులకు పనిష్మెంట్ వేస్తున్నారు. హౌం వర్క్ చేసుకొని రాలేదని స్థానిక మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులంలో విద్యార్థులను ఎండలో కూర్చోబెట్టి హౌం వర్క్ చేయించి సంఘటన గత బుధవారం చోటు చేసు కుంది. కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న కారణంగా సెలవుల్లో ఇంటికి వెల్లిన విద్యార్థులకు సంబంధిత గురుకుల ఉపాధ్యాయులు ఆన్లైన్ క్లాస్‌లకు సంబం దించిన హౌం వర్క్‌ను ఇచ్చారు. కోవిడ్ నిబంధనల మేరకు పాఠశాలను ఈ నెల 1వ తేదీ నుంచి తిరిగి ప్రారంభించడంతో విద్యార్థులు పాఠశాలకు వస్తున్నారు. ఈ క్రమంలో ఇచ్చిన హౌం వర్కు చేసుకోని రాలేదని విద్యార్థులను లోనికి అనుమ తించకుండా లగేజ్‌తోపాటు విద్యార్థులను పాఠశాలలోని గ్రౌండ్లో కూర్చోబెట్టి హౌం వర్కు చేయించడం గమనార్హం.ఈ విషయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. బచ్చన్నపేటకు చెంఇన విద్యార్థి ఆకుల దుర్గాప్రసాద్ ఆయన బాబారు నాగరాజును తీసుకుని పాఠశాలకు వచ్చారు. ఆనారోగ్య కారణంగా హౌం వర్కు చేయలేక పోయానని, పాఠశాలలో చేస్తానని విద్యార్థి ఎంత చెప్పినా వినకుండా సంబందిత ఉపాద్యా యులు వినలేదు. హోం వర్కు పూర్తి చేశాకే పాఠశాలకు రావాలన్నారు. పైగా వీరిని పాఠశాల గ్రౌండ్లో ఎర్రటెండలో కూర్చోపెట్టి హౌం వర్కు చేయించడం పట్ల విమర్శలొస్తున్నాయి. అతనితో పాటు హోం వర్కు చేయని పలువురు విద్యార్థులకు ఇదే తరహా పనిష్మెంట్ ఇవ్వడం శోచనీయం. సదరు ఉపాద్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహారిసు నాన్నరని పలువురు ఆరోపిస్తున్నారు. గతేడాది కూడ రాత్రి స్టడీ సమయంలో విద్యార్థులతో మట్టి మోయించిన ఘటనలు ఉన్నాయి. ఏకంగా కలెక్టర్ విచారించి సదరు ఉపాధ్యాయులను మందలించి మెమోలు జారీ చేశారు. అయినా తీరుమార్చు కోక పోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.