Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ రైతన్నకు తప్పని ఇక్కట్లు
అ చోద్యం చూస్తున్న పాలకులు
నవతెలంగాణ-మల్హర్రావు
అవసరమైన సమయంలో పంటలు వేస్తేనే ప్రయోజనం ఉన్నది అన్నమాట శాస్త్రవేత్తల మాట. అక్టోబర్ 25నుంచి యాసంగి సీజన్ పనులు ప్రారంభం కాగా చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు దిక్కులు చూస్తున్నారు. ఖరీఫ్ లో ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మద్దతు ధర కోసం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే డబ్బులు సకాలంలో అందలేదు. పంట రుణమాఫీ పూర్తిస్థాయిలో కాలేదు. అయితే వానాకాలం సీజన్లో అతి వర్షాలు,తెగుళ్లతో ఇబ్బందులు పడిన రైతంగానికి యాసంగిలో ప్రభుత్వ చేయూత కరువైపోయింది. చెరువుల్లో నీరు ఉండటంతో ఏ పంటకైనా సానుకూలమే. సమస్యల్లా పెట్టుబడి లేకపోవడమే. మండలంలో రబీ సీజన్లో 12,845 ఎకరాల్లో పంటలు సాగుతాయన్నది వ్యవసాయ అధికారుల అంచనా. యాసంగి ప్రారంభ మై రెండు నెలలు దాటుతున్నా కాసులు లేక కాడి కదలని పరిస్థితి. ఏ పంటలు సాగు చేయాలో నిర్దేశించేవారు కూడా కరువైయ్యారు.
సకాలంలో రుణాలివ్వాల్సిన బ్యాంకర్లు ఏటా కొర్రీలు విధిస్తుండగా లక్ష్యం చేరుకున్న దాఖలాలు తక్కువ. మండల వ్యాప్తంగా వానాకాలం సీజన్లో రూ.20 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉండగా రూ.8కోట్లు మాత్రమే ఇచ్చినటు సమాచారం. యాసంగిలో రుణాల ప్రక్రియ ఇప్పుడే మొదలయినట్లు రైతులు పేర్కొంటున్నారు. కాగా రుణమాఫీ ఇంకా సంపూ ర్ణంగా కాకపోవడం లబ్ధిదారుల సేకరణలో బ్యాంకర్లు తలమునకవడం గమనార్హం. ప్రభుత్వం రూ.25 వేల రుణం ఏక కాలంలో ఆ పై తీసుకున్నవారికి 4 విడ తలుగా మాఫీి చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.25 వేలు తీసుకున్నవారికి మాఫీకాగా రూ.50 వేల లోపు తీసుకున్నవారికి పూర్తి స్థాయిలో కాలేదు. లక్ష లోపు తీసుకున్నారు ఏండ్లుగా పడిగా పులు కాస్తున్నారు. ఇదే ఆసరా చేసుకున్న బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకు దాటవేసే ధోరణిని అనుసరి స్తుండడంతో ఇబ్బందులు తప్పేట్లు లేవు.