Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా నిబంధనలు పాటిస్తూ పాఠశాలకు హాజరు కావాలని ఎంఈఓ కోడెపాక రఘుపతి అన్నారు. శుక్రవారం మండలం లోని నవాబుపేట గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించి పాఠశాల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో సర్పంచ్ కసిరెడ్డి సాయి సుధా రత్నాకర్ రెడ్డి ప్రత్యేక దష్టి సారించి పాఠశాల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. ప్రతీ పాఠశాలను ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సతీష్, ఆదర్శ్, పంచాయతీ కార్యదర్శి సుచరిత వార్డుమెంబర్ ఓదెలు, సాధన, రాజు, విద్యా కమిటీ చైర్మన్ బాలకృష్ణ పాల్గొన్నారు.