Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెల్లికుదురు
ప్రాథమిక విద్యా వ్యవస్థకు క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్(సీఆర్పీలు) కీలకమైన వారని ఎంఈఓ గుగులో తు రాము అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని విద్యా వనరుల కార్యాలయ ఆవరణలో సీఆర్పీల డైరీ ఆవిష్కరణ శుక్రవారం చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ కరోనా పరిస్థితుల్లో బడి బయటి పిల్లలను బడిలో చేర్పించడం, బడి మానేసిన పిల్లల ను బడిలో నమోదు చేయించడం వంటి విధులను నిర్వర్తించడం అభినం దనీయమన్నారు. విద్యార్థుల హాజరు, నమోదు శాతం తగ్గకుండా చూడాలని సూచించారు. కరోనా నిబందనలు పాటిస్తూ పాఠశాలల సందర్శన చేయాల న్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీల రాష్ట్ర వ్యవస్థాపకులు డాక్టర్ భాస్కర్రావు ఆసోదు, బొడ్డు వీరాస్వామి, జంపాల కవిత, కవిత, రవి పాల్గొన్నారు.