Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘనపురం
రాజ్యాంగాన్ని అవమానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎంఎస్ఎఫ్ నేత రాగల్ల ఉపేందర్ డిమాండ్ చేశారు. ఆదివారం మండలం లోని నెల్లుట్ల గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు నల్ల లాజర్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారు మాట్లాడారు. రాజ్యాంగ పరిరక్షణకు అన్ని శక్తులను కలుపుకుని పోరాటాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు నరసింగ యాదయ్య, ఎంఎస్ఎఫ్ గ్రామ అధ్యక్షులు సతీష్, నాయకులు స్వామి, మైసయ్య పాల్గొన్నారు.
చిట్యాల : రాజ్యాంగాన్ని మార్చడం కాదు.. సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలని కాంగ్రెస్ మండల అధ్యక్షు లు గూట్ల తిరుపతి అన్నారు. ఆదివారం మండలంలోని జూకల్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశాసి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మండల, జిల్లా నాయకులు ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు బొట్ల రవి, కృష్ణయ్య, శ్రీనివాస్, ఎంపీటీసీ డి అనిల్, తదితరులు పాల్గొన్నారు.
భూపాలపల్లి : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే నేటి నుంచి దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపడతామని డీఎస్పీ జిల్లా అధ్యక్షులు కొత్తూరి రవీందర్ హెచ్చరించారు. ఆదివారం ఆయన విలే కరులతో మాట్లాడారు. రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్య లు చేయడం సరికాదన్నారు. నేడు అన్ని జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేస్తామన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్ మహారాజ్, భూపాలపల్లి మండల ఉపాధ్యక్షులు ప్రభుదాస్, డీఎస్పీ మహా ముత్తారం మండల అధ్యక్షులు హరీష్, జిల్లా కార్యదర్శి ప్రవీణ్ పాల్గొన్నారు
రేగొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ కూడలిలో అంబేద్కర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్‌పై దేశద్రోహం కేసు పెట్టాలన్నారు. నాయకులు మేకల రవికుమార్ మేకల బిక్షపతి, కొలిపాక సాంబయ్య, వాన రాశి అజరు ఎండి అస్లాం పాషా, కాశెట్టి రాజయ్య, బొల్లెపెళ్లి చంద్ర మొగిలి, దేవేందర్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు
భూపాలపల్లి : రాజ్యాంగం పై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి సత్యనారాయణ రావు పాలాభిషేకం చేఆరు. రాజ్యాంగం ద్వారానే సీఎం పదవి వచ్చిందన్న సోయి విస్మరించి మాట్లా డడం సరికాదన్నారు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. జిల్లా నాయకులు అంబాల శ్రీనివాస్, తోట సంతోష్, కౌన్సిలర్ శ్రీనివాస్,ర ాజయ్య, నాను, ప్రకాష్,యూత్ కాంగ్రెస్ రాజేందర్,తోట రంజిత్, పృథ్వి, వెంకీ యాదవ్, శ్రీకాంత్, అజరు ఉన్నారు
స్టేషన్‌ఘన్‌పూర్ : రాజ్యాంగాన్ని మార్చాలని అన్న సీఎం కేసీఆర్ ఆయన అవివేకానికి నిదర్శనమని కాంగ్రెస్ మండల మహిళా అధ్యక్షురాలు చింత జ్యోత్స్న అన్నారు. ఆదివారం శివునిపల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అన్ని వర్గాలకు మేలుతో పాటు అణగారిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించబడిన రాజ్యాంగాన్ని మార్చాలని డిమాండ్ చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మండల అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ చింత ఎల్లయ్య, ఎండి అన్వర్, సింగపురం వెంకటయ్య, నాగయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు గుర్రం రాజు, నాయకులు మ్యాకల మల్లేశం పాల్గొన్నారు.
కొడకండ్ల : రాజ్యాంగం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిరసనగా మండలంలోని రామవరం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ మండల ఎస్సీసెల్ అధ్యక్షులు బిక్షపతి, ఎస్టీ సెల్ అధ్యక్షుడు రాహుల్ నాయక్, మండల కార్యదర్శి రాజు పాల్గొన్నారు.