Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
సీఎం కేసీఆర్ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి గోనె కుమారస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం ఓంకార్ భవన్లో సుంచు జగదీశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయనమ మాట్లాడారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు వారి ప్రవర్తన మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిం చారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని సీఎం దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, లేనిచో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగార్జున, నరసయ్య, బీఎల్ఎఫ్ నాయకులు నగేష్, యాద లక్ష్మి, భారతి , పాల్గొన్నారు.
ఆత్మకూర్: రాజ్యంగం గురించి సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం అక్కంపేటలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా దళిత బహూజన ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిలువేరు బిక్షపతి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిలువేరు రాజు, సిలువేరు ప్రసంగి, ఇమ్మడి రవి,శీలం నరేష్, మంద ప్రవీణ్, సిలువేరు అశోక్ తదితరులు పాల్గొన్నారు.
పోచమ్మ మైదాన్: సీఎం కేసీఆర్ తన అనుచిత వ్యాఖ్యలను ఉససంహరించుకోవాలని ఆదివారం వరంగల్ మహానగర పాలక సంస్థ ఎదుట మాదిగ ఉద్యోగుల సమాఖ్య ఆధ్వవర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మైదం సంజీవ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాజ్యంగం గురించి అనుచితంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరిం చుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మంద రాజు, పల్లె ఉదరు, ప్రభాకర్, భాస్కర్, సురేష్,నర్సింగం తదితరులు పాల్గొన్నారు.
నెక్కొండ : సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అద్యక్షుడు మాంకాల యాదగిరి మాట్లాడు తూ.. సీఎం కేసీఆర్ తన వ్యాఖ్యలను వెనిక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాదారపు మాణిక్యం ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకురాలు కవిత, వికలాంగుల హక్కుల జిల్లా నాయకులు రాజు యాదవ్, నాయకులు మారంపల్లి కొమ్మలు తదితరులు పాల్గొన్నారు.
కాజీపేట : సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండ ిస్తూ ఆదివారం మడికొండలో కాంగ్రెస్ మండల మహిళా అధ్యక్షురాలు బైరి రజిని వేణు యాదవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందరభ:గా మాజీ కార్పొరేటర్ తోట్ల రాజుయాదవ్ మాట్లాడుతూ.. అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వారాల వెంకన్న, బైరి వరలక్ష్మి, లింగం మూర్తి, వస్కుల శంకర్, గుర్రపు జ్యోతి, అమర్నాథ్, రాజారావు స్వామి తదితరులు పాల్గొన్నారు.
కడిపికొండలో జరిగిన కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాము రమేష్, మండల అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్ తోట్ల రాజు యాదవ్, డివిజన్ సీనియర్ నాయకులు గంగులశ్రీనివాస్ రెడ్డి, కట్కూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు...
ఐనవోలు : సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండ ిస్తూ ఆదివారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండలాధ్యక్షుడు వడిచెర్ల శ్రీనివాస్ మాట్లా డారు. కార్యక్రమములో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రూపిరెడ్డి సాయిరెడ్డి, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎండీ రఫీ, కక్కిరాలపెళ్లి మాజీ సర్పంచ్ పాయిండ్ల సంపత్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు యాకర సాంబయ్య, మండల మైనారిటీ అధ్యక్షులు ఎం.డి.రహీం పాషా తదితరులు పాల్గొన్నారు.
కాశిబుగ్గ: రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో కాశిబుగ్గలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ, గీసుకొండ ఎంపీపీ సౌజన్య మాట్లాడారు. సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీలత, పీసీసీ కార్యదర్శి మహ్మద్ అయుబ్, వర్ధన్నపేట, దుగ్గొండి మండల అధ్యక్షులు మాలతి రెడ్డి, సక్కుబాయి, వరంగల్ తూర్పు నాయకులు రజియా, యశోద, అనిత, రాధిక తదితరులు పాల్గొన్నారు.
పర్వతగిరి: సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆదివారం మండల కేంద్రంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన తెలిపి అంబేద్కర్ చిత్రపటానికి పాలాభి షేకం చేశారు. అనంతరం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు మాట్లాడారు. సీఎం తన మాటలు వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలో మరింత ఉద్రిక్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్, పర్వతగిరి ఎంపీటీసీ మహేంద్ర, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు కందికట్ల అనిల్, పట్టణాధ్యక్షుడు దారం పూర్ణ చందర్, బీజేపీ నాయకులు కుడికాల శ్రీధర్, పిచ్చిరెడ్డి, దేవేందర్, (సీపీఐ(ఎం)) జిల్లా నాయకులు మాదాసి యాకుబ్, సీఐటీయూ నాయకులు ధర్మయ్య పాల్గొన్నారు.