Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
బాలసముద్రంలోని ఏకశిలా పార్కులో ఆదివారం ఏకశిలా పార్కు వాకర్స్ అసోసియేషన్ డైరీని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినరుభాస్కర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు పీ ఎల్లాగౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ పలు సమస్యలను ఛీప్ విప్‌కు వివరించారు. స్పందించిన ఆయన సుబేదారి సీఐ, ఎస్ఐలకు పార్కులక్ష పంచాయితీలు జరగకుండా చూడాలని ఆదేశించారు. పార్కులో టాయిలెట్స్ నిర్వహణ, వాచ్మెన్ తదితర సమస్యలు పరిష్కరించాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పడాల సోమయ్య, గౌరవాధ్యక్షుడు పొనుగోటి వెంగళ్రావు, ఉపాధ్యక్షుడు రాజిరెడ్డి, దేవా అరవింద్‌బాబు, ఆర్గనైజర్ వంగా రాజిరెడ్డి, కార్యదర్శి రవీందర్రావు, అరుణారెడ్డి, సుమతి, శ్రీదేవి పాల్గొన్నారు.