Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
రక్తదానం ప్రాణదానంతో సమానమని అరుణోదయ యూత్ సెంటర్ డైరెక్టర్ ఫాదర్ సైమాన్ అన్నారు. ఆదివారం ఫాతిమా కమ్యూనిటీ హాల్లో ఆయన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెడ్ క్రాస్ సొసైటీ మెంబర్ శ్రీనివాస్ తలసేమియా బాధిత చిన్నారులకు రక్తం అవసరమని తెలపడంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా 86మంది రక్తదానం చేసినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో కాసు మర్రెడ్డి యూత్ కమిటీ సభ్యులు యువత తదితరులు పాల్గొన్నారు