Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-ఖానాపురం
టీఆర్ఎస్ నాయకులనే దళితు బంధు పథకం లబ్దిదారులుగా ప్రకటించం పట్ల ఆదివారం బుధరావుపేట దళితులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు 365నేషనల్ హైవేపై సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బుధరావుపేట గ్రామానికి దళిత బంధు పథకం కింద 12 యూనిట్లు కేటాయించినట్టు తెలిపారు. అయితే గ్రామంలో 100దళిత కుటుంబాలున్నాయన్నారు. గ్రామ సభ ఏర్పాటు చేసి అర్హులను ఎంపిక చేయాలని వారు డిమాండ్ చేశారు.