Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లబెల్లి
స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గంలో వంద మందికి దళిత బంద్ ప్రకటించిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ నానబోయిన రాజారాం, ఎంపీటీసీ జన్ను జయరాంలు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. దళితుల అభివద్ధి కోసం ఈ పథకం ప్రారంభించడం అభినందనీయమన్నారు. మండల దళిత నాయకులు నాగేలి ప్రకాష్, పరికి రత్నం మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గంలో మొదటి విడతగా 100మంది దళితులను సెలెక్ట్ చేసి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వారి వివరాలను పంపించడం జరిగిందని, రెండో విడత లో దళితుల అందరికీ దళిత బందు వచ్చే విధంగా పెద్దన్న కషి చేస్తున్నాడని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ దాసరి లత నాగేశ్వరరావు, అణగారిన కులాల ఐక్య వేదిక అధ్యక్షుడు పరికి కోరేల్, పరికి నవీన్, సట్ల శ్రీనివాస్ గౌడ్, వార్డు సభ్యులు పెద్దబోయిన రాజన్న, అజరు బాబు,శ్యాంబాబు, బాబు, సాగర్, శ్రీకాంత్, శ్రీను, సునీల్, కార్తీక్,సుమంత్, తదితరులు పాల్గొన్నారు.